తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య సవాళ్లు… ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరాయి. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా అయ్యాయని, మంత్రితో కలిసి తిరిగే వాళ్లంతా డ్రగ్స్ కేసులో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. వీటికి తోడు డ్రగ్స్ అంబాసిడర్ కేటీఆర్ అంటూ రేవంత్ ఆరోపించటంతో రాజకీయాలు వేడెక్కాయి.
నా రక్తం, వెంట్రుకలు ఇస్తానని కేటీఆర్ ఛాలెంజ్ చేయటం… రేవంత్ రెడ్డి కూడా సై అనటంతో ఇష్యూ మరింత పెద్దదైంది. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ అంటూ కేటీఆర్ ను రక్తపరీక్షలకు రమ్మన్నారు. మాజీ ఎంపీ కొండాకు సైతం ఈ ఛాలెంజ్ ఇస్తూ మరో ముగ్గురిని నామినేట్ చేయమన్నారు. ఇందుకు కొండా కూడా సై అనటంతో ఇప్పుడు కేటీఆర్ వస్తారా… రారా… అన్న చర్చ తారా స్థాయికి చేరింది.
తాజాగా మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు నేను, కొండా వస్తున్నాము. మీరు కూడా రండి… మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు…? కేటీఆర్ డుమ్మా కొడితే డ్రగ్స్ తీసుకున్నట్లేగా అంటూ కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
To create awareness in the youth on increasing drug menace in the country…I have started the #WhiteChallenge and @KVishReddy has graciously accepted …Both of us will be waiting for @KTRTRS at Amaraveerula Sthupam today at 12 noon. pic.twitter.com/Q2OFWZAnu5
— Revanth Reddy (@revanth_anumula) September 20, 2021
Advertisements