ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార్యల విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వైరుద్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాము మూడు పెండ్లిండ్లు చేసుకుంటామని కొందరు అంటున్నారని ఆయన చెప్పారు.
తాము రెండు వివాహాలు చేసుకున్నప్పటికీ సమాజంలో ఆ ఇద్దరు భార్యలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కానీ మీరు(హిందువులు) ఒకరిని వివాహం చేసుకుని ముగ్గురితో సహజీవనం చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మీరు అటు భార్యను కానీ, ఇటు ప్రియురాళ్లను కానీ గౌరవించరని పేర్కొన్నారు. కానీ తాము మాత్రం అలా కాదన్నారు. రెండు వివాహాలు చేసుకుంటే వారిద్దరినీ సమానంగా గౌరవిస్తామన్నారు. రేషన్ కార్డులో తమ పిల్లల అందరి పేర్లు ఉంటాయన్నారు.
హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. ఈ దేశంలో ఎవరు ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పాల్సింది హిందువులు కాదని, దాన్ని రాజ్యాంగమే చెప్పాలని ఆయన అన్నారు. ఈ తరహా అంశాలను తెరపైకి తెచ్చి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తోందన్నారు.