సిగరెట్… ఒకప్పుడు వ్యసనం… ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. చాలా మంది ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం తాగడం అలవాటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. సిగరెట్ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫైన్ వేసినా సరే రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తు ఉంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్దగా సీరియస్ గా ఫోకస్ చేయడం లేదు. ఫైన్ అని చెప్పినా సరే పెద్దగా అమలు చేయడం లేదు.
దీనితో సిగరెట్ తాగే వాళ్ళు ఎక్కడైనా సరే తాగే పరిస్థితి ఉంది. అయితే బస్ లో సినిమా హాల్ లోపల మాత్రం కాస్త భయపడుతున్నారు. ఫైర్ అలారం ఉన్న చోట మాత్రం కాస్త జాగ్రత్త పడే పరిస్థితి ఉంది. అయితే సిగరెట్ తాగే వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. మన పక్కవారు సిగరెట్ తాగుతుంటే మనకి ఏం కాదులే అనే భావనలో చాలా మంది ఉంటారు.
ఆ పొగ పీల్చడం వలన మనకు చాలా నష్టాలు ఉన్నాయి. పిల్లలకు అది మరిన్ని సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇతరులు వదిలిన సిగరెట్ ప్రభావానికి చిన్నప్పుడు గనుక మనం లోనైతే ఆ సమస్యలు అన్నీ ఇన్ని కాదు. ఆడ పిల్లలకు అయితే పెద్దయిన తర్వాత కీళ్ళ నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. దీనికి సంబంధించి ఒక సర్వేలో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. ధూమపానానికి ఆ సమస్యకు చాలా దగ్గరి సంబంధం ఉందట. అందుకే సిగరెట్ తాగే వాళ్ళ పక్కన ఉండవద్దని సూచిస్తున్నారు. .