అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పోడు భూములకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెళ్లాడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో పలువురు అగ్ర కులస్థులు అటవీ భూములు కబ్జా చేశారని మండిప్డడారు ఆయన.
10,20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక నుంచి పోడు భూములు రక్షిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు సీఎం.
భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయొద్దని, అదే సమయంలో అధికారులపైనా గిరిజనులు దాడులు సహించబోమని,ఇక నుంచి అటవీ ప్రాంతాల్లోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని సీఎం కేసీఆర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని అన్నారు.
అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని అన్నారు. పోడు భూములపై సర్కార్ కు ప్రత్యేక విధానముందన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయని చెప్పారు. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయని,అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటేనే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. గుత్తి కోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని, అటవీ శాఖ అధికారులపై దాడులు సరికాదన్నారు.
గిరిజనులకు పాత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసని,పోడు భూములు అనేవి హక్కు కాదని.. దురాక్రమణ అని చెప్పారు. విచక్షణారహితంగా అడవులు నరికివేయడం సరికాదన్నారు.పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.