లాక్ డౌన్ పొడిగిద్దామని, ఇంకొన్ని రోజులు ప్రయాణికులకు రైల్వే సేవలను పక్కనపెడుదామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని ముందు ప్రతిపాదనలు పెట్టారు. రైల్వే ప్రయాణాలు మొదలైతే దేశంలోని మెట్రో నగరాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఎవరు ఎటు పోతున్నారో… ఎవరికి కరోనా ఉందో తెలియదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇక రాష్ట్రాల ఎఫ్ఆర్బీం పరిమితి పెంచటంతో పాటు అప్పులను రీ షెడ్యూల్ చేయాలన్నారు. ఇక జులై-ఆగస్టులో హైదరాబాద్ కంపెనీల ద్వారా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు ఆంక్షలు ఉండేలా చూడాలని కోరారు.
మరోవైపు దేశంలో సడలింపులతో రాష్ట్రంలో సడలింపులు ఇచ్చామని, కరోనాతో కలిసి జీవించే ప్రణాళిక రూపోందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ జోన్ లో ఎలాంటి వ్యూహాం అమలు చేయాలో ప్రతిపాదనలు తయారు చేయటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న సడలింపులపై అభిప్రాయాలను చెప్పాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు.