ఏపీలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.ఉపరితల ఆవర్తన ద్రోణీతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో రేపు (ఆగష్టు 4 న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి:
నేడు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముంది .
ఇక ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోస్తాంధ్రలోని పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.