టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది కోహ్లీసేన. అయితే మ్యాచ్ లో ఓ తప్పిదం జరిగిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ కాదంటూ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.

షాహిన్ అఫ్రిదీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. అయితే అది నో బాల్ అని అంటూ ఫొటోలు షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

వారు చూపించే ఫోటోల్లో లైన్ దాటి బౌలింగ్ వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ నాటౌట్ అని..

నో బాల్‌ కు ఔట్ ఇచ్చారని అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.