ఓటిటి లో కూడా అఖండ అదుర్స్…బాలయ్యకే సాధ్యం

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అయింది.

ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది.

శ్రీకాంత్ విలన్ గా నటించారు. పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా శుక్రవారం ఓటిటి లో రిలీజ్ అయింది. కాగా ఓటిటి లో కూడా ఈ చిత్రం నయా రికార్డు బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

రిలీజ్ అయ్యిన 24 గంటలు దాటక ముందే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ ఈ చిత్రానికి దక్కాయట. ఈ విధంగా ఏ తెలుగు సినిమాకి కూడా వ్యూస్ రాలేదట.

ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.