యాంకర్, నటి అనసూయ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ

అభిమానులతో టచ్ లో ఉంటుంది. అలాగే తనపై కామెంట్స్ చేసే వారికి కూడా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా… సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు పై వ్యాఖ్యలు పై పరోక్షంగా స్పందించారు అనసూయ

నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా బట్టలు వేసుకుంటున్న వారి గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయటంపై మండిపడ్డారు. పెద్దరికం అంటే వయసు తో వచ్చేడి కాదు అనుభవంతో వచ్చేది.

అనుభవమున్న వ్యక్తి ఇలా నీచంగా తనను కించపరుస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అంతటి అనుభవమున్న వ్యక్తి మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ప్రజలెవరూ పట్టించుకోకపోవటం బాధాకరం అన్నారు అనసూయ.

ఇకపోతే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు.

అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్‌ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్‌ మారిస్తే బావుంటుంది అని చెప్తున్నాను అంటూ పేర్కొన్నారు కోట