బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగు సీజన్ లను పూర్తి చేసుకొని 5వ సీజన్ ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.
అయితే ఈసారి కంటెస్టెంట్ లో ఒకరైన యాంకర్ రవి ని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి సెలబ్రిటీ లపై ట్రోల్స్ చాలా సమయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అవి హద్దుమీరినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
కాగా కంటెస్టెంట్ లలో ఒకరైన రవి పైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది.
ఇక ఇదే విషయంపై యాంకర్ రవి భార్య నిత్య స్పందిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో నా పేరు నా కూతురు పేరు తీసుకు వస్తున్నారని
ఇలా చేయడం మంచిది కాదని అసలు మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు.