ఏపీలో అగ్గై రగులుతున్న మూడు రాజధానుల సమస్య ఓ కొలిక్కి వచ్చేటట్టే కనిపిస్తుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.

ఈ అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. తాజాగా వాదోపవాదాలు విన్న తర్వాత బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

రెండు సంవత్పరాల తమ కష్టం ఫలించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది.

ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఏపీలో అగ్గై రగులుతున్న మూడు రాజధానుల సమస్య ఓ కొలిక్కి వచ్చేటట్టే కనిపిస్తుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.