పవన్ స్పందన రైట్ అనిపిస్తుంది… చిరు కామెంట్స్ వైరల్

ఇటీవల కాలంలో సినిమా టికెట్ల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగాస్టార్.

ఆ కార్యక్రమం లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరు. పవన్ కల్యాణ్ కొన్ని అంశాల్లో స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తుందని కళ్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడని, న్యాయం కోసమే వాదిస్తాడని అన్నారు.

తాను కూడా న్యాయం కోసం పోరాడతానని…కానీ కొంచెం సమయం తీసుకుంటానని అన్నారు. మన చిత్తశుద్ధి, నిజాయతీ, సంయమనం కచ్చితంగా విజయం ను తీసుకొస్తాయన్నారు చిరు.

చిరు చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.