సోషల్ మీడియా తన పై అసత్య ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగే విధంగా చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా కేసు వేస్తూ హీరోయిన్ సమంత కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.

కూకట్ పల్లి కోర్టు లో సమంత వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని సమంత తరుపు న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు.

కాగా న్యాయవాది బాలాజీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఎదుట అందరు సమానమేనని… ప్రొసీజర్ ప్రకారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

మరి చూడాలి సమంత కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో. ఇక 2021 అక్టోబర్ 2న నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది.

అప్పటి నుంచి కూడా సమంతపై ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో ఇలా రకరకాల వార్తలు ప్రసారం అయ్యాయి.