మిలటరీ వాళ్ళు బుల్లెట్ బండి ఎందుకు వాడతారు…?

మిలటరీ వాళ్ళు ఎక్కువగా వాడే బండి బులెట్ లేదా రాజ్ ధూత్… ఈ రెండు కాకుండా వాళ్ళు మరో బండి వాడటానికి ఇష్టపడరు. రాయల్ ఎన్ ఫీల్డ్ లో బులెట్ తరహా బండ్లు అన్నీ వాడుతూ ఉంటారు.

ఇప్పుడు రాజ్ ధూత్ బళ్ళు పెద్దగా కనపడవు. అసలు వాళ్ళు ఆ బండి ఎందుకు వాడతారు అనేది చాలా మందికి స్పష్టత లేదు.

ఇప్పుడు రాజ్ ధూత్ బళ్ళు పెద్దగా కనపడవు. అసలు వాళ్ళు ఆ బండి ఎందుకు వాడతారు అనేది చాలా మందికి స్పష్టత లేదు. ఒక్కసారి వాళ్ళు ఎందుకు ఆ బండ్లు వాడతారో చూద్దాం.

ఎక్కువగా రిపబ్లిక్ పెరేడ్, స్వంతంత్ర దినోత్సవ వేడుకలలో మోటార్ సైకిల్ విన్యాసాలు మనం చూస్తూ ఉంటాం.

సైనిక దళాలలో, పారా మిలిటరీ విభాగాలలో కొంతమంది సైనికులు బులెట్ మోటార్ సైకిల్స్ పై విన్యాసాలను ఎక్కువగా బులెట్ తోనే చేస్తూ ఉంటారు. అసలు ఆర్మీలో వాటి చరిత్ర ఒక్కసారి చూస్తే… రెండవ ప్రపంచ యుద్ధము లో ఈ వాహనాలు మంచి ఫలితాలు ఇచ్చాయి.

సరిహద్దులు కొండ ప్రాంతాలు కాబట్టి ఆర్మీ కి వీటిని ఎక్కువగా ఇచ్చారు. దేశ సరిహద్దులలో, కొండ ప్రాంతాల్లో మిలటరీ వాళ్ళు చేరుకోవాలి అంటే ఇవి బాగా సహకరించేవి.

ఇక వీటి తయారి కూడా ఆర్మీని ప్రమాదాల నుంచి కాపాడింది. బండి పడినా సరే పెద్ద పెద్ద గాయాలు అయ్యేవి కాదు. బంపర్ నిర్మాణం కూడా కాస్త బలంగా ఉంటుంది.