అతడిపై కోపాన్ని ఆచార్యపై చూపిస్తున్నాడా?

ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఉన్న కీలకమైన వ్యక్తి దిల్ రాజే ఈ మొత్తం వివాదానికి కారణంగా కనిపిస్తోంది. అతడు తీస్తున్న ఎఫ్3 సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎప్పుడైతే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే ఎఫ్3 సినిమా 28న వస్తుందని దిల్ రాజు నుంచి స్టేట్ మెంట్ వచ్చింది

దీంతో జనాలంతా ఆశ్చర్యపోయారు. పెద్ద మనిషిగా చలామణి అవుతున్న దిల్ రాజు ఇలాంటి పని చేయడం ఏంటంటూ చర్చలు మొదలుపెట్టారు.

అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక రీజన్ వేరే ఉందని తెలుస్తోంది. ఆచార్య నైజాం రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగా ట్రై చేశారు. కానీ దిల్ రాజు కోట్ చేసిన మొత్తం కంటే ఇంకాస్త ఎక్కువకు వరంగల్ శ్రీను, ఆచార్య రైట్స్ తీసుకున్నారు.

దీనికి సంబంధించి దిల్ రాజుకు కోపం ఉందంటారు. పైగా వరంగల్ శ్రీను, దిల్ రాజుకు క్రాక్ రిలీజ్ టైమ్ లో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు కాదు, కిల్ రాజు అంటూ వరంగల్ శ్రీను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆచార్యకు పోటీగా ఒక్క రోజు ముందు ఎఫ్3 సినిమాను దిల్ రాజు రిలీజ్ కు రెడీ చేశారంటూ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.