కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైమెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అదేంటంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట.

అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియరావట్లేదు.

ఇక చరణ్ ఎన్టీఆర్ లు కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.