మా లో ఇంకా లొల్లి కొనసాగుతూనే ఉంది. మాకు అన్యాయం జరిగింది, ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. పోలింగ్ సెంటర్ కు సంబంధించిన సీసీ టీవీ చూపించాలని…

అందరికీ ఉన్న అనుమానాలు ఆ సీసీ ఫుటేజ్ తో తీరుతాయని అన్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి లేఖ రాయగా సీసీ ఫుటేజ్ ఇవ్వటానికి నిరాకరించారు ఎన్నికల అధికారి కృష్ణ మోహన్.

అయితే తాజాగా మా వివాదంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ పేర్కొన్నాడు.

వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ కాగా వర్మ కు కౌంటర్ ఇచ్చాడు మంచు మనోజ్. మా ఒక సర్కస్ అయితే

మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. మరి మనోజ్ ట్వీట్ కి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.