మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే మంచు విష్ణు ఇటీవలే ప్రమాణస్వీకారం కూడా చేశారు.

మరోవైపు ఎన్నికలు పారదర్శకంగా జరగలేదంటూ ప్రకాష్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా కూడా రాజీనామా బాట పట్టారు.

పోలింగ్ రోజు మా ప్యానల్ సభ్యులపై దాడులు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ సీసీ ఫుటేజ్ బయటకు విడుదల చేయాలంటూ ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని తెలిపారు.

దీంతో ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. ఇలా ఇంకా మా లో వేడి తగ్గకముందే తాజాగా మంచు విష్ణు మరో ట్వీట్ చేశారు.

రేపు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ ప్రకటించారు. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి మారింది.