లవ్ స్టోరీ సినిమా ఇచ్చిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. నిజానికి ఓ బేబీ హిట్ తరువాత నందిని రెడ్డి విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతుందని టాక్ నడించింది.
కానీ అది వీలు పడలేదు. దీనితో విజయ్ కోసం రాసిన కథనే నాగ చైతన్య కు వినిపించిందట నందిని. చైతు కు కూడా ఆ కథ నచ్చిందట. ఇప్పుడు చైతు, నందిని చేయబోతున్న కథ కూడా అదేనట. ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కబోతుంది.
ఇదిలా ఉండగా నాగార్జున హీరో గా నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో కేసుల నటిస్తున్నాడు నాగ చైతన్య. అలాగే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా లోనూ నటిస్తున్నాడు.