బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి సంస్థ ఆహలో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారమైంది.

అయితే మొదటి ఎపిసోడ్ కు మోహన్ బాబు మంచు విష్ణు మంచు, లక్ష్మి మంచు లు గెస్ట్ గా వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా సెకండ్ గెస్ట్ ఎవరు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే మొదటి ఎపిసోడ్ కు మోహన్ బాబు మంచు విష్ణు మంచు, లక్ష్మి మంచు లు గెస్ట్ గా వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా సెకండ్ గెస్ట్ ఎవరు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే రెండో ఎపిసోడ్ గెస్ట్ ఎవరు అనేదాని పై క్లారిటీ వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ ప్రోమో లో నందమూరి బాలకృష్ణ నాని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు.

అలాగే ఇద్దరూ క్రికెట్ కూడా ఆడారు. అలాగే టక్ జగదీష్ సినిమా రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు చేసిన ప్రెస్ మీట్ గురించి కూడా మాట్లాడారు నాని.