సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతుంది.

అయితే ఇప్పుడు విలన్ గా కూడా మారబోతుంది ఈ బ్యూటీ. నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం చిత్రం కాతువాకుల రెండు కాదల్.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సామ్, విజయ్ సేతుపతి ప్రేమించుకుంటారట.

కానీ నయన్ మాత్రం వారిని విడదీసే విలన్ పాత్రలో దర్శనమివ్వనుందట. సమంత ను విడదీసి విజయ్ సేతుపతికి తాను దగ్గరవ్వాలని చూస్తుంటుందట.

ఇక ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించటంతో పాటు నయన్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.