జ్ఞానవేల్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై భీమ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ అయింది.

ఘన విజయం సాధించటంతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

అయితే మరోవైపు అదే స్థాయిలో వివాదాలు కూడా ఈ సినిమాపై తలెత్తాయి. సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ సన్నివేశాన్ని మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దుమణగలేదు.

అయితే తాజాగా జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.

అలాగే కుల అల్లర్లను రెచ్చగొట్టి కొన్ని వర్గాలను అవమానించిన నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే అతనిపై దాడి చేసిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటన చేశాడు.