గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD. గతంలో శ్రీకాంత్ హీరో వచ్చిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల… తన కూతురు కాదంటూ ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు అన్నారు.

శ్రీలీల తన మాజీ భార్యకు మాత్రమే కూతురని చెప్పుకొచ్చారు. విడిపోయిన తరువాత శ్రీలీల నా మాజీ భార్యకు పుట్టిందని, ఆస్తులను క్లైమ్ చేయడానికి నా పేరు వాడుతున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై చట్టపరంగా ముందుకు వెళ్తానని ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయన్నారు.

సన్మాన సభలో ఏ ఆధారంతో తన కుమార్తెగా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.