సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటాడు వర్మ. సామాన్యుడు నుంచి రాజకీయ నాయకుడు సినీ ప్రముఖుడు ఇలా సంబంధం లేకుండా అందరిని కూడా విమర్శిస్తూ ఉంటాడు.

అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భార్య ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదని కానీ తన భార్యను కించపరిచే విధంగా వైసిపి నాయకులు మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు.

ఇదే విషయంపై ఆర్జీవీ స్పందించారు. ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూసి చంద్రబాబు నాయుడు ఎక్కి ఎక్కి ఏడ్చాడని ట్వీట్ చేశారు. చంద్రబాబు వీడియో ని ఎడిట్ చేసి మూవీ ప్రమోషన్స్ కు వాడేసాడు.

అయితే దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు టిడిపి నేతలు కూడా ఫైర్ అవుతున్నారు.

అలాగే మరో ట్వీట్ చేస్తూ… ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను..కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను.

ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది అంటూ ట్వీట్ చేశారు.