భారీ ఫైట్స్ చేయబోతున్న సమంత

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తోంది. ఇటు కమర్షియల్ హంగులు, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ సంస్థ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు

ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకుముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతోంది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది

దీని కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమౌతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌ నేతృత్వంలో ట్రయినింగ్ తీసుకుంటోంది.

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశాడు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయన డైరక్ట్ చేశాడు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా కూడా ఆయన వర్క్ చేశారు.