నాకు అబార్షన్లు అయ్యాయంటున్నారుబాధగా ఉంది – సమంత

నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత. నేను డివోర్స్ బాధలో ఉన్నాను.

విడిపోవడం ఎంతో బాధతో కూడినది ఇలాంటి బాధాకర సమయంలో నా పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమంత.

నాకు ఎఫైర్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. నేను పిల్లల్ని వద్దనుకున్నాను అని ప్రచారం చేశారు. నన్ను ఒక అవకాశవాది అని అన్నారు.

నాకు అబార్షన్లు కూడా అయ్యాయని ప్రచారం చేశారు.విడిపోవడం చాలా బాధ తో కూడుకున్న నిర్ణయం. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇలాంటి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.

వ్యక్తిగతంగా నా పై జరుగుతున్న దాడి చాలా బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఇక 2017 అక్టోబర్ 7న నాగ చైతన్య ను సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.