సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ నటిస్తున్నారు.

అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సమంత ఓ ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సాంగ్ కోసం సమంత కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. అయితే సమంత కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా అందుకు ఓకే చేశారట.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.