ఇటీవల నాగచైతన్య సమంత తాము విడిపోతున్నామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన చేసిన తర్వాత విడిపోవడానికి ఇవే కారణాలు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఎఫైర్ పెట్టుకుందని… అందుకే నాగచైతన్య సమంత విడిపోయారని రూమర్ వినిపించింది.

ఈ రూమర్స్ పై ప్రీతమ్ జుకల్కర్ తాజాగా మాట్లాడుతూ… నాతో పాటు సమంత పై చేస్తున్న ట్రోలింగ్ బాధాకరంగా ఉందని

దీనిపై నాగచైతన్య స్పందించకపోవడం ఇంకా బాధను కలిగిస్తోందని… నేను సమంతను అక్క అని పిలుస్తాను అని చెప్పుకొచ్చారు.

ఈ విషయం నాగచైతన్య తో పాటు చాలామందికి తెలుసని…కానీ ఆయన ఈ రూమర్ పై స్పందించకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు.

నాగచైతన్య ఒక స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయని చెప్పుకొచ్చారు ప్రీతమ్ జుకల్కర్.