శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టక్ జగదీష్.

డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించారు.

అలాగే జగపతి బాబు కీలక పాత్రలో నటించారు.

అయితే తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైంది.

ఈ చిత్రంకు 10.90 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఈ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.