లావణ్య త్రిపాఠి కి ప్రపోజ్ చేయబోతున్న మెగా హీరో ?

సోషల్ మీడియా ఇటీవల అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. అది నిజమా, అబద్దమా అనేది పక్కన పెడితే… ముందు అయితే విపరీతంగా వైరల్ అయిపోతాయి.

ఇక నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు వరుణ్ కు సోషల్ మీడియా వేదిక విషెస్ తెలుపుతూ ఉంటే ఓ వార్త మాత్రం షాక్ కి గురి చేస్తోంది.

అదేంటంటే లావణ్య త్రిపాఠి ని వరుణ్ తేజ్ లవ్ చేస్తున్నాడట. ఆ విషయం చెప్పటానికి పాతిక లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకుని వరుణ్ ఈరోజు బెంగళూరు బయల్దేరి వెళ్లారట

అక్కడ లావణ్య కు పెళ్లి ప్రపోజ్ చేయబోతున్నారట వరుణ్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుణ్ గని సినిమా చేస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.