గొప్పలు చెప్పుకోవడమే.. ఆచరణలో అంతా నిర్లక్ష్యమే..!

హైదరాబాద్ విశ్వనగరమని.. ఏదేదో చేసేస్తామని.. టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతుందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు.

తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో.. లేదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందన్నారు. తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల జీవితాలు నాశనమైపోతుంటే అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోందే తప్ప..

ఇలాంటి ఘోరాలను నివారించే చర్యలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడం లేదని విమర్శించారు.