హైకోర్ట్ న్యాయమూర్తులకు జీతాలు ఎవరు ఇస్తారు…?

హైకోర్టు న్యాయమూర్తులకు జీతాలను ఆయా రాష్ట్రాల ‘కన్సాలిడేటెడ్ ఫండ్’ లేక ‘కంటింజెన్సీ ఫండ్’ నుండి జీతాలు చెల్లిస్తూ ఉంటారు. వారి జీతాలు ఎంత అనేది పార్లమెంట్ లో నిర్మాణం జరుగుతుంది

ఈ ఫండు నుండి జీతభత్యాలను రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విడుదల చేస్తారు. అది రాష్ట్ర నిధే గాని అందులో నుంచి చెల్లించే జీతాలను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

ఇక హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం వారికి ఇవ్వాల్సిన పెన్షన్, ఇతర సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వపు “కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా” నుండి చెల్లించడం జరుగుతుంది.

విశ్రాంత న్యాయమూర్తుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఉండదు. కరోనా మొదటి వేవ్ సమయంలో ఏపీ ప్రభుత్వం జీతాల్లో కోత  విధించడం వివాదాస్పదం అయింది