ఓ సినిమా హిట్టయినప్పుడు ఆటోమేటిగ్గా ఆ దర్శకుడు, హీరోకు క్రేజ్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఆ కాంబినేషన్ కు క్రేజ్ పెరుగుతుంది. మళ్లీ మళ్లీ ఆ కాంబోలో సినిమాలు చూడాలనుకుంటారు ప్రేక్షకులు.
సరిగ్గా పాతికేళ్ల కిందట వచ్చిన సినిమా పెళ్లిసందడి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. సూపర్ హిట్ అనే కంటే ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటి అని చెప్పడం కరెక్ట్.
“పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేనే రాఘవేంద్రరావు గారి దగ్గరకు వెళ్లి మరో సినిమా చేద్దామని కోరాను. ప్రొడ్యూసర్లు కూడా రెడీగా ఉన్నారు. కానీ పెళ్లిసందడి కంటే మంచి సబ్జెక్ట్ దొరికితేనే చేస్తానన్నారు రాఘవేంద్రరావు.
భారీ అంచనాల వల్ల కచ్చితంగా ఏ సినిమా చేసినా ఫెయిల్ అవుతుందని రాఘవేంద్రరావు గారు నాతో చెప్పారు. అది నాకు దెబ్బేసింది. అందుకే మళ్లీ ఆయనతో సినిమా చేయలేకపోయాను.”