ఆధార్ కార్డ్ అనేది భారతీయులందరికీ అవసరమైన గుర్తింపు కార్డు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డులో తమ ఫోటోలను తామే చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటప్పుడు ఆధార్ కార్డును ఎవరికన్నా చూపించాలంటే ఇబ్బందిగా ఉంటుంది.

కాబట్టి చాలామంది ఆధార్ కార్డు ఫోటో మార్చాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసం సింపుల్ ఫుల్ స్టెప్స్ లో ఆధార్ ఆర్ కార్డు ఫోటో ఎలా అప్డేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

యుఐడిఎఐ ఆధార్ కార్డులో ఫోటోలు మార్చే, లేదా అప్డేట్ చేసే ఆప్షన్ ను ఇస్తుంది. దీని కోసం ఆధార్ నమోదు కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.

లేదంటే యుఐడిఎఐ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో ఈ పని చేయొచ్చు. ముందుగా యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్ uidai.gov.in/ ని ఓపెన్ చేయాలి ఈ పోర్టల్ నుండి ముందుగా ఆధార్ నమోదు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫామ్ లో అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.

అయితే ఫోటో మార్చాలి అనుకునేవారు కేవలం ఫోటో మార్పు సంబంధించిన వివరాలను మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది.

దానిని దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో ఇవ్వాలి ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా వారు మీ వివరాలను నిర్ధారించుకుంటారు ఎగ్జిక్యూటివ్ మీ కొత్త ఫోటోలు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో తీసుకుంటారు

అయితే ఫోటో మార్పు చేయడానికి 25 రూపాయలతో పాటు జిఎస్టి కూడా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మీరు కోరిన అప్డేట్ అభ్యర్థన నెంబర్ తో రసీదు ఇస్తారు దాంతో అధికారిక వెబ్సైట్లో మీ అప్డేట్ స్టేటస్ లో చెక్ చేయొచ్చు.