చాలా వెస్ట్రన్ దేశాల్లో పెళ్లిల్లో ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తుంది. పెళ్లి రిసెప్షన్ తర్వాత పెళ్లి డ్రెస్ లో ఉన్న వధువు గౌన్ లోకి వరుడు దూకి ఆమె ధరించిన గార్టర్ ను కిందకు లాగి…. అక్కడే ఉన్న పెళ్లికాని పురుషుల మీదకు విసిరేయాల్సి ఉంటుంది. వారిలో ఎవరో ఒకరు ఈ గార్టన్ ను క్యాచ్ పట్టుకుంటారు.
పెళ్లికొడుకు…..పెళ్లి కూతురి గార్టర్ కిందకు లాగి విసిరేయకంటే ముందే పెళ్లి కూతురు తన చేతిలోని బొకే ను పెళ్లికాని అమ్మాయిలకు విసిరేస్తుంది.దాన్ని ఎవరో ఒకరు క్యాచ్ పట్టుకుంటారు. ఇక ఇప్పుడు గార్టర్ క్యాచ్ పట్టుకున్న అబ్బాయి…ఆ గ్యార్టర్ ను పూల బొకే క్యాచ్ పట్టిన అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది.
గార్టర్ : పెళ్లి సమయంలో వధువులు తమ వెడ్డింగ్ డ్రెస్ లోపల ధరిస్తారు. ఇది ధరిస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం.