ఫాదర్స్ డే రోజున టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన కుమారుడిని అభిమానులకు పరిచయం చేశాడు. తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆయన పంచుకున్నారు.
యువరాజ్ సింగ్ కు, బ్రిటీష్ నటి, మోడల్ హేజల్ కీచ్ తో 2016లో వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వారికి పుత్రుడు జన్మించాడు. ఈ విషయాన్ని యువీ దంపతులు ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే కుమారుడి ఫోటోలను మాత్రం యువీ షేర్ చేయలేదు.
తాజాగా తన కుమారుడి పేరు ఓరియన్ కీచ్ సింగ్ అని చెబుతూ బాబు ఫోటోలను యువరాజ్ షేర్ చేశారు. దీనికి ‘ ఓరియన్ కీచ్… నీకు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నాము. నీపై ప్రేమను కురిపించేందుకు నీ తల్లి దండ్రులు సిద్ధంగా ఉన్నారు’ అని రాసుకొచ్చారు.
ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. కీచ్ ఫోటోలను చూసి యువీ అభిమానులు సంబురపడిపోతున్నారు. హౌ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2000లో కెన్యాతో జరిగిన మ్యాచ్ తో ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టారు.