ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికతల్లో సింధు లోయ నాగరికత కూడా ఒకటని చెప్పబడింది. అయితే అప్పట్లో సింధులోయలో నివాసం ఉన్నవారు హిందువులేనా ? అన్న అనుమానం కలుగుతుంది. కానీ వారు హిందువులుగా కాక తమను తాము భారతీయులుగా చెప్పుకున్నారు. అంటే భరత దేశానికి చెందిన వారు అన్నమాట. అలాగే శంతన ధర్మాన్ని పాటించేవారు. అయితే వీరు హిందూ ధర్మాన్ని అనుసరించే వారా, లేదా అన్న విషయంపై కూడా సందేహం నెలకొంది.
సింధు నాగరికత నిజానికి చాలా పురాతనమైంది. క్రీస్తు పూర్వం 4500 నుంచి 5000 ఏళ్ల కిందట ఈ నాగరికత ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 2300 నుంచి 2000 సంవత్సరాల మధ్య ఈ నాగరికత అత్యున్నత స్థాయికి చేరుకుంది. అందువల్ల సింధు నాగరికతను పురాతన ఈజిప్టు నాగరికత కన్నా 1000 సంవత్సరాల పాతదని చెబుతారు.
అయితే చరిత్ర చెబుతున్న ప్రకారం సింధు నాగరికతలో ప్రజలు ధర్మాన్ని పాటించేవారని తెలుస్తోంది. వారు హిందూ దేవుళ్లు, దేవతలను పూజించే వారని వారి కాలానికి చెందిన చిహ్నాలు, ముద్రలు చెబుతున్నాయి. అప్పటి నాగరికతకు చెందిన శివ పశుపతి ముద్ర, స్వస్తిక్ చిహ్నాలు గతంలో బయట పడ్డాయి. అందువల్ల వారు అప్పట్లో హిందూ ధర్మాన్ని కూడా పాటించేవారని స్పష్టమవుతోంది.