రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల ధర్నాను ప్రారంభించారు. ఆమెతో పాటు పార్టీ సీనియర్ నేత ఫర్హద్ హకీమ్, అరూప్ విశ్వాస్, సుభ్రతా భక్షి, సోవన్ దేవ్ చట్టపోధ్యాయ్, ఇతర నేతలు ధర్నాలో పాల్గొన్నారు.
ఎంజీఎన్ఆర్‌ఈజీఏ, గృహ, రహదారుల ఇతర పథకాలకు సంబంధించిన నిధులను కేంద్రం ఉద్దేశ పూర్వకంగా ఆపుతోందని టీఎంసీ నేతలు ఆరోపించారు. రేపు సాయంత్రం వరకు ఈ ధర్నా కొనసాగనుంది. ధర్నా సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ…
ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఇందిరా ఆవాస్ యోజనా పథకాలకు కేంద్రం నిధులు నిలిపి వేసిందని ఆరోపించారు. ఓబీసీ విధ్యార్థులకు ఉపకారవేతనాలను కూడా ఆపివేసిందన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద చేపట్టి పనులను పూర్తి చేయడంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో వుందన్నారు.
అలాంటి రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ. 7000 కోట్లు ఇంకా విడుదల చేయలేదన్నారను. దీనిపై పలు మార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్ పై కేంద్ర వివక్షతను నిరసిస్తూ ముఖ్యమంత్రిగా ధర్నాకు దిగుతున్నానన్నారు.