వెస్టిండీస్ ఆల్ రౌండర్ డారెన్ సమీని పాకిస్థాన్ అత్యున్నత అవార్డు నిషాన్-ఎ-పాకిస్థాన్ తో సత్కరించనుంది. సత్కారంతో పాటు పాకిస్థాన్ గౌరవ పౌరసత్వం కూడా ఇవ్వనుంది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిప్ అల్వీ ఈ నెల 23న ఈ అవార్డ్ ను అందజేయనున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ కు ఆయన చేసిన వెలకట్టలేని సేవలకు గుర్తుగా పౌరసత్వం ప్రకటించినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. సమీ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ పెషావర్ జల్మీకి నేతృత్వం వహిస్తున్నారు.