అంతర్జాతీయ క్రికెట్ లోకి బాహుబలి వచ్చేస్తున్నాడు. 140కిలోల బరువుతో క్రికెట్ ఆడడమే కాదు..దేశవాళీ పోటీల్లో రాణిస్తూ .. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ జట్టులోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఆ క్రికెటర్ పేరు రకీం కార్నివాల్. ఆంటిగ్వా కు చెందిన రకీమ్ కార్నివాల్ వెస్టిండీస్ క్రికెట్ లో ప్రస్తుతం ఓ సంచలనం.. కరీబియెన్ ప్రీమియర్ లీగ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే కాకుండా ఇటీవల ఇండియా ఏతో జరిగిన మ్యాచ్ ల్లోనూ సత్తా చాటాడు.దీంతో విండీస్ క్రికెట్ బోర్డు కార్నివాల్ ను టెస్ట్ టీమ్ లోకి తీసుకుంది. కార్నివాల్ మున్ముందు విండీస్ జట్టులో అద్భుతాలు సృష్టిస్తాడని విశ్వసిస్తున్న విండీస్ సెలెక్టర్లు కార్నివాల్ బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేస్తున్నాడని తెలిపింది. కార్నివాల్ ఎంత బరువున్నప్పటికీ ఫిట్ నెస్ కు ఎలాంటి ఢోకా లేదని విండీస్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేసింది. . ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 55 మ్యాచులు ఆడిన కార్నివాల్ 2224 పరుగులు చేసి 260 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో తుదిజట్టులోకి బాహుబలి వస్తే.. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది..
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » బాహుబలి క్రికెటర్ వచ్చేస్తున్నాడు