మహారాష్ట్ర వాసాయిలోని మార్డెస్ బీచ్ కు భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. అయితే అప్పటికే అది చనిపోయి ఉంది. 40 అడుగుల పొడవుతో… 30 టన్నుల బరువుతో ఇది ఉందని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో గత నెలలోనే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
తిమింగలం వేగంగా కుళ్లిపోతుండడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తోంది. ఇది సముద్రంలోనే చనిపోయి.. అలల వేగానికి ఒడ్డుకు కొట్టుకొచ్చిందని చెబుతున్నారు అధికారులు. అయితే ఈ భారీ వేల్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దానితో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు.