విరాటపర్వం.. రానా-సాయిపల్లివి హీరో, హీరోయిన్లుగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఉడుగుల వేణు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. దీన్ని మొదలుపెట్టిన నాటి నుంచి ఆసక్తి రేకెత్తించే ప్రోమోలతో అందరి అంచనాలు పెంచుతూ వచ్చారు మేకర్స్. షూటింగ్ పూర్తై కూడా చాలా కాలం అవుతోంది. కానీ.. ఎందుకో ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవట్లేదు. రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఇటు రానా.. అటు సాయిపల్లవి ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఈ సినిమాను గతేడాది వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, అప్పుడు కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తర్వాత పరిస్థితులు చక్కబడినా కూడా మూవీ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేయలేదు. అప్పట్లో ఇది కూడా ఓటీటీకి చెక్కేస్తుందని వార్తొలచ్చాయి. కానీ.. బేరం తెగకపోవడంతో నిర్మాతలు సైలెంట్ అయిపోయారు.
పోనీ.. ఈ మూవీ వెనుక ఉన్నది చిన్న పేర్లా అంటే.. అదీ కాదు. సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్ బాబు నిర్మించారు. దృశ్యం 2, నారప్పలను ఓటీటీకి అమ్మేసిన సురేష్ బాబు, విరాటపర్వంను ఎందుకు ఇవ్వడం లేదనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. 90వ దశకంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు.
ఇందులో రానా కామ్రేడ్ `రవన్న` పాత్ర పోషిస్తున్నాడు. అతను తన కలంపేరు `అరణ్య`గా ప్రసిద్ది. సాయి పల్లవి `వెన్నెల` అనే పాత్రలో కనిపించనుంది. అయితే.. ఈ మూవీ విడుదల సూచనలైతే ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. ఈ వేసవికి విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ఇప్పటికే సినిమాకు సంబంధించి ఏదో ఒక ప్రకటన వచ్చి ఉండాలి. కానీ.. అది జరగలేదు.