సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. అలాగే ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. మరో హీరోగా రానా నటించగా… నిత్యమీనన్ సంయుక్తమీనన్ లు హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆంధ్రాలో బెనిఫిట్ షో లకు పరిమిషన్ ఇవ్వకపోతే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, పాల్వంచ, అశ్వారావుపేట, సత్తుపల్లి, కోదాడ, హైదరాబాదుకు కూడా వెళ్లి చూశారు. మొత్తం 70 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాలు తీస్తే గ్రాస్ పరంగా 200 కోట్లు వసూలు చేసింది.
టికెట్స్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల అనుకున్న దాని కంటే ఈ చిత్రం తక్కువ వసూళ్లను సాధించింది. అలాగే రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా పవన్ క్రేజ్ తో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమా థియేటర్స్ లో అదరగొట్టినప్పటికీ టీవీలలో మాత్రం అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేకపోయింది.
సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ
ఈ సినిమాకు 9.06 టిఆర్పి రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమా వస్తుందంటే ప్రతి ఒక్కరూ టీవీలలో చూస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పబ్లిక్ ఆసక్తి కనబరచలేదు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. ఓటిటిల్లో వచ్చేయడం, రీమేక్ సినిమా కావటం వీటన్నింటి వల్లే ఈ తక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చి ఉంటుందని పండితులు అంచనా వేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు రెండోసారి వేసినప్పుడు వచ్చే రేటింగ్ కన్నా తక్కువ రేటింగ్ భీమ్లా నాయక్ కు రావటం గమనార్హం.
చిరు లైఫ్ లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా ?