మన దేశంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. టీ ఉదయం సాయంత్రం, పని ఒత్తిడిలో ఉండాల్సిందే. సాంప్రదాయ ఔషధంగా టీ ని గౌరవిస్తారు. అయితే టీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అసలు అవి ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
Also Read:భారీగా డ్రగ్స్ పట్టివేత..!
టీలో లభించే కాటెచిన్‌లు, థెఫ్లావిన్స్ మరియు థియారూబిగిన్స్ వంటి సమ్మేళనాలు అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, క్యాన్సర్ నిరోధక అలాగే కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. వేడి వేడి టీ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకుంటే టీ మాత్రం చాలా మంచిది. టీలోని ఫ్లేవనాయిడ్లు (కాటెచిన్స్ అని పిలుస్తారు) మీ జీవప్రక్రియను పెంచడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది.
గ్రీన్ మరియు బ్లాక్ టీలో ఉండే సూక్ష్మపోషకాలు (పాలీఫెనాల్స్) మీ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల, ఈ పానీయాల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండే ముఖ్యమైన కాటెచిన్ క్యాన్సర్-పోరాట లక్షణాలను కలిగి ఉంది. న్యూరోలాజికల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా టీ సహాయపడుతుంది.
అతిసారం, మలబద్ధకం, అల్సర్లు మరియు కడుపు నొప్పితో బాధపడేవారు తరచుగా హెర్బల్ టీలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే టీలోని టానిన్లు పేగు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండెకు చాలా మంచిది. తద్వారా గుండెపోటు, రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read:రాత్రి సమయంలో బట్టలు ఎందుకు ఉతకకూడదు…?