మైగ్రేన్ తల నొప్పి” చాలా మందికి బ్రతికి ఉండగానే నరకం చూపించే సమస్య. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సాధ్యం కాదు. అసలు ఈ మైగ్రేన్ గురించి బాధ పడే వారికి కూడా దాని గురించి అవగాహన లేదు. దాదాపుగా ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ఈ తల నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read:పులిపిరులు ఎలా వస్తాయి…? అవి నిజంగా అంటు వ్యాదేనా…?
ఇక మైగ్రేన్ తలనొప్పి సంకేతం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి నొప్పి మొదలయ్యే ముందు ఎడమ కన్ను లాగుతున్నట్టుగా ఉంటుంది. మరికొందరికి వచ్చే ముందు ఎడమ పక్క మెడ కండరాలు బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు జాగ్రత్తపడకపోతే మాత్రం నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కొంత మందికి తలనొప్పి వచ్చే ముందు వాంతి వచ్చినట్టు ఉండటం, కంటి చూపు లో మార్పులు రావడం… మొహం మీద ఒక పక్క లేదా అరిచేతిలో చేయి లో సూదులు గుచ్చుకున్నట్టు ఉండటం జరుగుతుంది.
ఇక మైగ్రేన్ వచ్చినప్పుడు వెలుతురు చూడలేరు, శబ్దం వినడంతో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మైగ్రైన్ రావడానికి కారణాలు ఏంటీ అంటే… రక్తంలో చెక్కర లెవెల్స్ తగ్గడం, నీరు తక్కువ తాగడం, ఆల్కాహాల్ ఎక్కువ తాగడం, నిద్రలేమి, చాక్లెట్స్ ఎక్కువగా తినడం వంటివి మైగ్రేన్ కు కారణం. ఇక మైగ్రేన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా తల నొప్పి వచ్చినప్పుడు బండి నడపడం, పెద్ద యంత్రాలతో పని చేయడం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
Also Read:జులై 5న బల్కంపేట అమ్మవారి కల్యాణం.. 5 లక్షలకు పైగా భక్తులు..!