స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు సంపాదించవచ్చు అనే భావం లో చాలా మంది ఉంటారు. దీనితో స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేకపోయినా షేర్ లు కోనేస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ…? ఏయే పద్దతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది…?
Also Read:పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీరే!!
మార్కెట్ల గురించి నేర్చుకోకుండా ట్రేడింగ్/పెట్టుబడి పెట్టడం మంచిది. ఒక రకంగా అది జూదమే. ఒకసారి లాభం వస్తే మరోసారి నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేర్చుకున్నది ప్రణాళికాబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందులోనే విజయం ఉంటుంది. మూలధన రక్షణ ఇందులో కీలకం. లాభాల వెంటపడి దాన్ని మరువడం మంచిది కాదు. ట్రేడింగ్ కాల్స్ కొరకు ఎవ్వరికీ డబ్బు కట్టడం మంచిది కాదు.
ఇటువంటి విద్యలు సొంతంగా నేర్చుకుని సాధించాల్సి ఉంటుంది. టీవీలో వచ్చే ప్రకటనలు అసలు ఏ మాత్రం నమ్మాడం మంచిది కాదు. ప్రతి ఒక్క ట్రేడ్/స్టాక్ నుంచి అద్భుత లాభాలు ఆశించడం పద్ధతి కాదు. అసాధ్యం కాదు అలా అని సుసాధ్యం కాదు. లాభం వచ్చినపుడు అత్యాశకు పోవటం, నష్టం వస్తే డీలా పడటం కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. స్టాక్ బ్రోకర్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విశ్వసనీయ స్టాక్ బ్రోకర్ను ఎంచుకోవడం చాలా మంచిది.
Also Read:సరస్సులో కొట్టుకొచ్చిన కరెన్సీ కట్టలు.. ఎక్కడంటే..?