ఫోన్ చేతిలో లేకపోతే ప్రపంచం నాశనం అయినట్టే ఫీల్ అవుతారు కొందరు. తిన్నా, తాగినా, పడుకున్నా సరే మన పక్కనే ఉండాలి ఫోన్. లేదంటే మాత్రం మైండ్ పని చేయదు. ఇక బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకువెళ్ళి అక్కడ సమయం గడుపుతున్నారు. చూసుకోవడానికి టైం లేదు రా అన్నట్టు అక్కడికి వెళ్లి చూసుకోవడం మాత్రం ఆశ్చర్యపరుస్తుంది.
అయితే అలా బాత్ రూమ్ లో కి వెళ్లి ఫోన్ వాడటంతో చాలా సమస్యలే ఉన్నాయి. అసలు ఏంటి ఆ సమస్యలు అనేది ఒక్కసారి చూద్దాం. బాత్ రూం లోకి మొబైల్ తీసుకువెళ్లి అక్కడ ఎక్కువ సేపు గడపడంతో ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. అదేంటి అంటారా…? ఉంది దానికో లింకు… ఎక్కువసేపు మల విసర్జన ఆసనంలో కూర్చోడంతో ఆ స్థానంలో ఒత్తిడి ఏర్పడుతుంది. పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక బాత్ రూం లో ఉండే బ్యాక్టీరియా మొబైల్ పైకి వస్తుంది. దాని ద్వారా మన వేళ్ళకు అంటుకుని నోట్లోకి వెళ్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన మలంపై ఉండే బ్యాక్టీరియా దాదాపు ఆరు అడుగుల వరకు వెళ్తుంది. టైం వృధా కావడం కూడా జరుగుతుంది. అందుకే ఫోన్ ను తీసుకెళ్లకుండా వెళ్ళిన పని పూర్తి చేసుకుని రండి.
Also Read: టాక్స్ చెల్లించే ఉద్యోగులకు గుడ్ న్యూస్, నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెప్పినట్టే