వేసవి కాలం పోయినా సరే ఉష్ణోగ్రతలో మాత్రం మార్పు రావడం లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వేడి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. దీనితో ఏసీ మీద ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఏసీకీ ప్రజలు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. గత అయిదేళ్ళ కాలంలో ఏసీ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. కాని ఏసీ వాడితే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Also Read: ప్రభుత్వ వాహనాలు ఎవరికి ఇస్తారు…? వాటికి ఉండే రూల్స్ ఏంటీ…?
శరీరానికి సాధారణ వేడిని కూడా తట్టుకొనే క్రమంగా తగ్గిపోతుంది. చర్మము పొడి బారి పోయి తేమ కోల్పోవడంతో శరీరం త్వరగా మడతలు పడటానికి, సహజం గా ఉన్న రంగు కోల్పోవడానికి అవకాశం ఎక్కువ. కళ్ళు కూడా పొడిబారి మంటలు వచ్చే అవకాశం ఉంది. తరచుగా ఫిల్టర్ శుభ్రం చేసుకోకపోతే గది లో వున్న సూక్ష్మ జీవులు పెరిగి శ్వాస సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఏముకలు బొలు గా అయ్యి శరీరం తేమ కోల్పోవడం వల్ల తొందరగా విరగడానికి అవకాశాలు ఎక్కువ. ఏసీలో ఉంటే ఫ్రిజ్ లో వున్న ఆపిల్ లా ఉండి ఆ తర్వాత బయటకు రాగానే ఆపిల్ లో నీళ్ళు కారినట్టు కారి నీరసం అయిపోతాం. అందుకే ఏసీలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. టెంపరేచర్ 26 లో సెట్ చేసుకుని, ఏసీ ఆపిన తర్వాత కానీ,మొదలు పెట్టడానికి ఒక గంట ముందు కానీ కిటికీ తలుపులు తీసి వుంచి, తరచుగా ఫిల్టర్లు క్లీన్ చేసుకోవాలి.
Also Read: ఎఫ్ఐఆర్ లో కులం పేరు ఎందుకు నమోదు చేస్తారు…?