పోకిరి” టాలీవుడ్ కు ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా అని రుచి చూపించిన సినిమా. అప్పటి వరకు తెలుగు సినిమా ఒక లోకంలో ఉంటే పోకిరి దెబ్బకు అభిమానులు, ప్రేక్షకులు అందరూ సినిమా అంటే ఇలా కూడా ఉండవచ్చు అనుకునేలా ప్రూవ్ చేసిన సినిమా. హీరో అంటే కష్టాలతో పోరాడి, ఫైట్ లు చేసి హీరోయిన్ ని ప్రేమించి గొడవల పది యుద్ధం చేసి పెళ్లి చేసుకునే వాడు. లేదంటే ఒక ప్రాంత ప్రజల కోసం పోరాడే వాడు.
కాని పోకిరి సినిమా మాత్రం వీటికి భిన్నంగా ఫాన్స్ కు ఏది కావాలో అది ఇచ్చిన సినిమా. అసలు పోకిరి సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి కారణాలు ఏంటీ…? ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ లో ఆ సినిమాలో ఏముంది…?
డైరెక్టర్: సినిమా కథ కంటే కూడా డైరెక్టర్ దమ్ము ఈ సినిమాకు ప్రధాన బలం. మహేష్ బాబు అంటే చిన్న పిల్లలు చూసే సినిమాలు చేస్తాడు, సైలెంట్ గా ఉంటాడు అనే పేరు ఉండేది. ఎప్పుడైతే పూరి జగన్నాథ్ చేతిలో పడ్డాడో… మహేష్ బాబులో ఈ కోణం కూడా ఉందా అనే రేంజ్ లో ఆ సినిమా ఉంది. మహేష్ నటనలో కొత్త దనంతో పాటుగా యువత ఒక స్టార్ హీరో నుంచి ఏం కోరుకుంటారో అవి చూపించాడు పూరి.
కథ: సినిమాకు మరో బలం కథ అనే చెప్పాలి. అప్పటి వరకు సాదా సీదాగా వెళ్తున్న సినిమాలో ఊహించని టర్నింగ్ పాయింట్ తో సినిమా రేంజ్ మారిపోయింది. కృష్ణ మనోహర్ ఐపిఎస్ అనగానే ఫాన్స్ కు పిచ్చి పట్టింది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు కూడా లేచి నిలబడేలా చేసింది ఆ సినిమా క్లైమాక్స్.
హీరోయిన్: ఈ సినిమాతో ఇలియానా కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోయిన్ అంత క్యూట్ గా ఉండటంతో ఆమెను చూడటానికి యువత పరుగులు తీసారు.
కామెడి: అలీ, బ్రహ్మానందం కామెడి సినిమాను మరో రేంజ్ కు తీసుకు వెళ్ళింది. సాఫ్ట్ వేర్ హడావుడి ఎక్కువగా ఉండే టైం లో బ్రహ్మానందం ను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చూపించి ఆయనతో భిన్నంగా ఉండే కామెడి చేయించి ఫాన్స్ కు నవ్వుల పండుగ తెచ్చారు.
డైలాగ్ లు: యూత్ ను బాగా ఆకట్టుకునే డైలాగ్ లు రాయడంలో పూరి దిట్ట అని మరోసారి ఆ సినిమాతో నిరూపించుకున్నారు. చివరికి విలన్ నోటి నుంచి వచ్చిన మాటలు కూడా పాపులర్ అయ్యాయి.