బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో రహదారి వెంబడి వేలాదిగా జనం బండి సంజయ్ తో పాల్గొంటున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవిస్తున్నారు. బీజేపీలోకి చేరడానికి కూడా చాలా మంది ముందుకు రావడంతో బండి సంజయ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.
అయితే ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ సమీపంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ రైతు కోరికను..కాదనకుండా బండి సంజయ్ తీర్చడంతో అతను ఎంతో సంతోష పడ్డాడు.
అటుగా.. పాదయాత్ర రావడం గమనించిన రైతు.. బండి సంజయ్ వద్దకు వచ్చి తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాలని కోరాడు. వెంటనే రైతు కోరిక మేరకు బండి సంజయ్ ఆ రైతు పొలంలో ట్రాక్టర్ ఎక్కి కాసేపు దుక్కి దున్నారు.